నీడని చూస్తూ భయపడితే
నువ్వంటే నీకే భయమేస్తుంది.
ఒక్కసారి తల తిప్పావంటె
గొప్ప కాంతి నీక్కనిపిస్తుంది.
ఒక వైపే తిరిగి ఉండి వెలుగే లేదనుకుంటె
నాణానికి మరొ వైపు లేదని పొరబడినట్టే.
సంతోషం ఎక్కడో ఉందని నువ్వనుకుంటె.
నీ ప్రయాణమంతా ఆ నీడల చీకటి వైపే .
ఒక్కసారి కనులు తెరచి నలు దిక్కులు ఛూస్తే
బక్కవాడి పక్కనుండి ప్రపంచాన్ని గమనిస్తే
తెలుస్తుంది నేస్తం నువు పొందుతున్న ఆనందం
విరుస్తుంది నీలో నవ జీవన వసంతం..
భాధకు , ఆనందానికి మధ్యనుంది నువ్వే
దేనినైన , నీ దానిని చేసేది నీ నవ్వే
ఈ సాగర పయనంలొ ప్రతి అలలొ సారం
నీ జీవన గమన మంత కలల సమాహారం..
నీకు ఈ లొకానికి మధ్యనొక్క అద్ధముంది
నువ్వు చూస్తున్నదంత నీకు అందు అర్థమైంది
మకిలి తనం,మురికి తనం ఆ అద్ధంలొ నీ బింబం
మనసుతోటి చరిస్తే ప్రతి మనిషి నీ బంధం.
ఏదొ చెయ్యాలని , ఇంకేదో సాధించాలని
ఎవరో నువ్వవ్వాలని , నలుగురు నిను చూడాలని
వాంచ పోవు వేల వరకు , కాంక్ష తీరు గడియ వరకు
నీ దారిలొ నువు పయనిస్తూ నీ చేతిని అందివ్వు.
నువు నమ్మిన అమ్మకాన్ని నమ్మకంగ పంచివ్వు.
సహనంతో సాహసివై , సంకల్పం ఊపిరియై
ఈ క్షణమే నిజమనుకో.. ఇదియే నీ గెలుపనుకో..
with love
phani vissapragada..