స్వాగతం
ప్రపంచాన్ని కబలించ వచ్చెనని ,
యుగాంత వేళను మోసుకోచ్చునని ,
భీతిల్లిన ఈ పన్నెండు తన చివరి మజిలీ చేరింది .
పరుగే ఆపని కాలాశ్వం మరో ఏటి రాయి దాటింది .
ఉత్పాతాలు , ఉప్పెనలు,భూకంపాలు ,విపత్తులు ,
ప్రకృతి రూపంలో చేరి మన ఆకృతి వికృతి చేసినా...
హింసావాదం,మతోన్మాదం,ప్రాంతీయత,ఉగ్రవాదం,
మనమే పెంచిన భావాలై , మన మూలాల్నే ప్రశ్నించినా ..
ఆశపాసం చేతబూని ఆ కాలాశ్వం పై చేసే స్వారీ ,
అలుపెరగని మానవ గమనానికి నాందీవాచకం ప్రతీసారీ ...
ఎప్పుడూ ముందుకు సాగే తత్వం ..
విరళత్వం వారిస్తున్నా , నలుగురితో నడిచే సరళత్వం..
నిన్నటికన్నా , రేపు స్వచ్చమని ఊహించే గుణం .,
ఈ క్షణమే బతుకని తలచి బతకగలిగే తనం.,
వచ్చే రోజులు మరింత ముచ్చటని భావిస్తూ మనం.,
రెండు చేతులా ఈ రెండు వేల పదమూడు ని స్వాగాతిద్దాం ..
ప్రతి క్షణం జీవన మహత్తును అనుభవిద్దాం ......