తండ్రి రాసిన ప్రేమ లేఖ.
ఏరా తల్లీ , మగాడికి పురిటి బాధ తెలీదని ఏమహానుభావుడన్నాడో తెలీదు
కానీ నువు ఎంచక్కా మీ
అమ్మ పేగును పట్టుకుని బయటకి రావటానికి ఇబ్బంది
పడుతూ , పెడుతూ మీ అమ్మకి పురిటి
నొప్పుల బాధ తెలియకుండానే
ఆపరేషన్ గదిలోకి లాక్కెళ్ళేలా చేశావ్.. మగాన్నయిన పాపానికి మీ అమ్మ లోపల పడే
బాధ తెలీదు కానీ అది నన్ను
కౌగిలించుకుని హాస్పిటల్ మంచం మీద పడుకోవటం
తోటే నా గుండెల్లో నొప్పి
మొదలైంది రా...భరించలేని నొప్పి.
క్షణాలు గడుస్తున్న కొద్దీ అది నా నరాలు
తెమ్పేస్తూ ఎప్పుడెప్పుడు నువ్వు ఏడుస్తావో అని , కోటి దేవూళ్లను ప్రార్ధిస్తూ , మీ
అమ్మకి బాధ తెలియకూడదని ఎన్నో
దేవత్థల పేర్లు పఠిస్తూ , ఆ ఆపరేషన్ గది
తలుపుకి నా
చెవులు రెండూ అప్పగించి నేను
పడిన బాధ వర్ణనాతీతం రా.
కొంత సేపటికీ నువ్వు దయతలచి నీ చిట్టి స్వరంతో
ఈ ప్రపంచాన్ని మొట్టమొదటి
సారి చూసి ఏడ్చిన వేల
ఆత్రేయ గారి " నేను పుట్టాను ఈ
లోకం ఏడ్చింది , నేను ఏద్చను ఈ
లోకం నవ్వింది " పాటను తల్చుకుంటూ నీ
ఏడుపులో నా ఆనందాని వెతుక్కున్నానంటే
నమ్ము.
నర్సు నన్ను పిల్చి
నిన్ను చూడమన్నప్పుడు ఏదో ఆ క్షణంలో
మసక మసకగా నువ్వు నాకు
కన్పించావ్. ఏమిటో ఈ కళ్ళు
, నిన్ను చూసిన వెంటనే చెమ్మగిల్లీ
పోయి , నిన్ను సరిగా చూడనిస్తెగా? వాటిక్కుడా
అసూయాలేరా నాకు వాటికంటే కూడా
నువ్వు ఎక్కువయిపోతావేమో అని వాటి భయం.
నీ బొడ్డు కోసిన క్షణం నుండి
, నా పొత్తిళ్లలో నువ్వు వచ్చే వరకు ఎంత
నొప్పో తెలుసా నాన్నా..నువ్వెలా ఉన్నావో అని
నా మనసంతా వొకటే ఆదుర్దా . మీ
అమ్మ పిచ్చిధి రా !! ఎంతో ఆనందాన్ని
నాకు నాకుటుంబానికి ఇచ్చి మత్తులో ఆ
ఆపరేషన్ గదిలో పడుకుని ఉంది
చూడు. దానికి నీకంటే నాకంటే మరో ప్రపంచం తెలీదు
సుమా . అందుకేనేమో నువ్వు మొదటిగా మీ అమ్మనే చూసావ్
, ఎంతైనా అమ్మ కూతురివి కదా
!! నన్నునాన్నని చేసిన మీ అమ్మ
, నాకు కూతిరిగా పుట్టిన ఆ అమ్మవైన " నువ్వుు
" ఇధరూ నాకు రెండు కళ్ళు
రా. కానీ నీకు కూతురే
ఎక్కువ బావా అని మీ
అమ్మ అంటుంటే వినాలని , నాన్నా నీకు అమ్మ అంటేనే
ఇష్టం అనే నీ బుంగమూతి
చూడాలని ఎంత ఆశగా ఉంది
చెప్పలేనంటే నమ్ము. అయినా
ఇంకా ఎన్ని రోజులుందని..? నువ్వ్గింకా
ఇప్పుడేగా ఈ నాన్న జీవితంలోకి
వచ్చావ్..
నీ ముద్దు ముద్దు మాటలు, బుడి బుడి
నడకలు, చిట్టి పొట్టి గౌనులు , నా చెవులలో నిలిచే
నీ పట్టీల శబ్దం , నీకు అక్షరాభ్యాసం చేయించేటప్పుడు
బియ్యంలో నీచేత రాయించే శ్రీకారం
, బారసాల సమయంలో నువ్వేం పట్టుకుంటావో అని ఆత్రంగా ఎదురు
చూసే నా కళ్ళు , ఇంకా
ఇలా ఎన్నో ఎన్నో నా
మదిని తొలిచేస్తూ గిలిగింతలు పెడుతున్నాయి రా.
అలాగని
నువు తొందరగా పెద్దవ్వకు సుమా!! నీ ప్రతి క్షణాన్ని
నన్ను ఆస్వాదించనివ్వు , ఆనందించనివ్వు . నిన్ను మనసారా అభినందించనివ్వు. ఏమో నీకు పెళ్లి
చేసి పంపించే సమయంలో నీతో పాటు వచేస్తానని
నేనూ ఏడుస్తానేమో.,నిన్ను హోస్టెల్లో పెట్టాల్సి వస్తే నేను మంచం
పడతానేమో , నిన్ను మీ అమ్మ ఎప్పుడైనా
తిడితే నా ప్రాణానికి ప్రాణమయిన
దాన్ని కసురుకుంటనేమో ,. ఏదేమైనా కన్నా కనీసం నువ్వైనా
ఒక నాటికి నాన్న పదే తియ్యని
నొప్పులు జీవితాంతం ఉంటాయని , అవి పురిటి నొప్పులతో
మాయమయ్యేవి కావని , మై డాడ్ ఇస్
మై బెస్ట్ ఫ్రెండ్ అని నీ స్నేహితులకి
చెబూతింటే వినాలని ఉందిరా.
కానీ
తొందర వద్ధు సుమా. నీతో
నేను గడిపే ప్రతి క్షణం
చాలా నెమ్మదిగా సాగాలి . మన జీవితంలో ప్రతి
క్షణం చాలా గొప్పగా ఉండాలి
. మరి ఎప్పటికె నువ్వే నాకు కూతురిగా పుట్టాలి
. అలా అని మాటివ్వు . ఇవ్వవా.??
అయిన ఎందుకిస్తావులే ?? ఎంతైనా
నువ్వు అమ్మ కూతురివి కదా
..ఇప్పుడే మీ అమ్మని వదిలి
రావులే . కానీ ఈ నాన్నని
మర్చిపోకు!! ఎలా మర్ఛి పోతావ్
? నువ్వు నా బంగారు తల్లివి
కదా..
కూతురికి ప్రేమతో ...
ఫణి విస్శాప్రగడ..