మమతలతల్లి.... ఒడి ......బాహుబలి లాగా...
గోదారితాల్లి..... ఒడి .....బాగుపడి ...
అని పాడాలని ఉంది..ఆ తల్లి ఒడి లో బడి కెళ్లిన నా లాంటి ఎంతో మంది కోన సీమ వాసులు రోజూ తిలకించి ఆనందించే ఆ దక్షిణ గంగ అందాలను నా కలం అనే కలశం లో పట్టి అభిషేకించిన అక్షర అమృత ధార...మీరూ నిజంగా చూడాలంటే మా కోన సీమ వైపు ఓ టూర్ వేసెయ్యండి మరి , పుష్కర స్నానం చేసేయ్యండి మరి..

మా గోదారి అందాలు.
నింగినుండి తొంగి చూసే నిత్యాగ్నిహొత్రమ్,
మా గోదారి తల్లి గుండెల్లో ప్రతిబింబించే వేళ
మంచునూ , మంటను పక్కపక్కనే చూసి ,
మన కళ్ళల్లో కాంతులు విరిసె వేళ
మెల్ల మెల్లగా పెరిగే ఎర్ర కాంతి ఏరులు ,
ఎల్లలన్ని దాటి మా పల్లెల్లో పారాడే వేళ
రాత్రంతా వణికిన మాగోదారి తల్లి పాదాల చెంత,
రవికిరణం సింధూరపు రంగవల్లులు దిద్దే వేళ
పచ్చనైన పట్టు చీర కట్టిన మా పల్లెటూళ్లు ,
కదిలే గోదారి వంక గర్వంగా చూచు వేళ
దారంతా పరుచుకున్న మా కోనసీమ కొబ్బరి ,
తన పంచను కొంచెం మనకు పంచాలని వంగు వేళ,
తాటి చెట్ల నీడల్లో కళ్ళు బాబుల కబుర్లు ,
వేప చెట్ల వాకిట్లో కొలువు దీరిన కోవెళ్లు,
తెల్లారింది లేగండనీ కూసే కోళ్లు,
చల్లారని ఆశలతో నడిచే రైతన్నలు.
పుష్కర శోభలతో అలరారే గోదార్లొ కన్నెలు ,
మునకలు వేసే మదిలో వురకలు వేసే ఊహలు ,
చల్లనైన వేళలో , వెచ్ఛనైనమనస్సులు
గోదారిని ఢీకొట్టే లాంచీల్లో ప్రయాణాలు,
ఎటు చూసినా పచ్చని పైర్లు , కల్మషం లేని కలువ పూలు,
మనుషుల్లాంటి మనుషులు , మనసుతోటి మాటలు ,
వేద ఘోష గా సాగే గోదారి తల్లి వురకలు ,
నాదానికి ఆది ఇదే , భావాలకి బీజ మిదె.
వూరంతా మన ఇల్లే, అందరూ మన బంధువులే ,
అంగరంగ వైభవాన , సకల రంగులు తన సోయగాన,
అంతరంగ అందంతో అలంకరించుకున్న భామ ,
ఆ అమరులు సైతం అసూయపడే భూ స్వర్గ సీమ ..
ఈ గోదావరి పుష్కరాన పులకించే మా కోన సీమ.