కోనేటి కోటలో కొలువైన
కలువ రాణుల కళ్ళు కరిగి పోయేలా..
నిండుగా పైనుండి పండు వెన్నెల నిచ్చు
నెల రేడు మబ్బుల్లో జారి పోయేలా..
గాలి తరగల చాటు గారాలు పోయే
మా పెరటి మల్లియల మనసు విరిగేలా..
సాయంత్ర వేళలో సెలవంటూ సాగే
సూరీడు మిము చూసి కంది పోయేలా..
సంద్యా రాగపు కాంతుల ఎర్రదనం మీ చెక్కిళ్ళను చేరగా ,
గుంపులు గుంపులుగా గులాబీలు గుసగుస లాడగా..
ఎర్రటి పెదవుల తలుపులు తెరచి ,
తెల్లటి మీ మనసును పరచి
నవ్వరా , ఒక్కసారి జాజి పువ్వులా ..
నా కివ్వరా మీ నవ్వులు జన్మ జన్మలా..
కలువ రాణుల కళ్ళు కరిగి పోయేలా..
నిండుగా పైనుండి పండు వెన్నెల నిచ్చు
నెల రేడు మబ్బుల్లో జారి పోయేలా..
గాలి తరగల చాటు గారాలు పోయే
మా పెరటి మల్లియల మనసు విరిగేలా..
సాయంత్ర వేళలో సెలవంటూ సాగే
సూరీడు మిము చూసి కంది పోయేలా..
సంద్యా రాగపు కాంతుల ఎర్రదనం మీ చెక్కిళ్ళను చేరగా ,
గుంపులు గుంపులుగా గులాబీలు గుసగుస లాడగా..
ఎర్రటి పెదవుల తలుపులు తెరచి ,
తెల్లటి మీ మనసును పరచి
నవ్వరా , ఒక్కసారి జాజి పువ్వులా ..
నా కివ్వరా మీ నవ్వులు జన్మ జన్మలా..
No comments:
Post a Comment