చీకటికి ఆధారం ఏమిటి ? అసలు చీకటి అంటే ? ఎందుకు మన వాళ్ళు అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు ?
ఇలాంటి చాలా ప్రశ్నలు మనస్సుని మదిస్తుంటే ....
నాకు అనిపించిన , నా మదికి కనిపించిన జవాబు , చీకటి అనేది అసలు లేనేలేదు .మనం దేనిని చీకటి అంటున్నామో అది కేవలం వెలుగు లేని స్థితి మాత్రమే . చీకటిని పారద్రోలాలంటే , యుద్ధం చెయ్యాల్సింది చీకటితో కాదు , వెలుగుతో ..
.. చీకటి చిందులు
నేలంతా పరచుకున్న నల్ల పిల్లి పిల్లలు ,
నింగి నుండి చొరబడే నిశాసతీ చూపులు..
సంధ్యా సుందరి మెలకువలో ఎల్లలకే సెలవులు.
హద్దులున్న చోటల్లా కల్లబొల్లి ఛాయలు.
మసలుతున్న మానవులం మేసలలేని వేళలు.
అలసిన ఆ భానుమూర్తి తీసుకునే సెలవులు .
ప్రాణికోటి స్పందనకే మసి పూసిన నీడలు
కనులున్నా చుదలేనే చీకటమ్మ లీలలు .
జాబిలమ్మ కుంచె పట్టి నల్ల గుడ్డపై గీసే గీతలు
తెల్లటి వెన్నెల కిరణాల్లో అవనిన అలముకొనే కాంతులు
వెలుగులేని నీడలో జరుగుతున్న వింతలు
నిశీధిలో నినదించే నమ్మలేని నిజాలు .
కన్నుల్లో కాగడాలు సాగించే నడకలు ,
అన్వేషణ ఆపలేని ధైర్యం గల మనుషులు .
చల్లగాలి వింజామరలో సేదతీరు జీవులు
ఫాను గాలి పడకలో బాధతీర్చు నిద్రలు .
ఉదయం రవికిరణంతో కాల చక్రం మొదలు
రాతిరి చంద్రుని వెన్నెలలో అవనికెన్ని హొయలు..?
No comments:
Post a Comment